తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు తమిళనాడు మాత్రమే కాకుండా భారతదేశం, ఖండాంతరాల్లోనూ అభిమానులు ఉన్నారు. అదీ మామూలు అభిమానులు కాదు, వీరాభిమానులు. ‘తలైవర్’ (నాయకుడు)కు చిన్న అసౌకర్యం కలిగినా హైరానా పడిపోతుంటారు. తాజాగా ఆయనకు తీవ్రస్థాయిలో జ్వరం వచ్చిందని, ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ మాత్రం బాగోలేదంటూ వార్తలు వినిపించాయి. దీంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. అయితే వీటిని రజనీకాంత్ పీఆర్వో రియాజ్ కొట్టిపారేశారు. అవన్నీ వదంతులేనని తేల్చారు.
