ఆ మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు: బండ్ల గణేశ్

సినీనిర్మాత, నటుడు బండ్ల గణేశ్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కొందరు మళ్లీ పోస్ట్ చేస్తున్నారు. దీంతో నొచ్చుకున్న ఆయన ఏ రాజకీయాలతో తనకు సంబంధంలేదని, గతంలో చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు పోస్టు చేయొద్దని అభ్యర్థిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండ్ల గణేశ్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తూ పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ విషయాలు సోషల్ మీడియాలో కొందరు రీపోస్టు చేస్తుండటం బండ్ల గణేశ్ కు ఇబ్బందికరంగా మారాయి. దీనిపై ఆయన స్పందిస్తూ ఆదివారం తన ట్విట్టర్ పేజీలో ఏ ట్వీట్ చేశారు. ‘నాకు ఏ రాజకీయ పార్టీలతో, ఏ రాజకీయాలతో సంబంధంలేదు. నేను రాజకీయాలకు దూరం. దయచేసి గతంలో మాట్లాడిన మాటల్ని ఇప్పుడు పోస్ట్ చేయొద్దు. ఇది నా అభ్యర్థన. మీ బండ్ల గణేశ్’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ పై నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు స్పందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.