‘బాహుబలి’ చిత్రంలో భల్లాలదేవుడిగా నటించి కళ్లల్లో కపటాన్ని, క్రూరత్వ నటనను పండించిన నటుడు రానా. అంతటి స్టార్ నటుడు కూడా కంటతడి పెట్టడంతో ఆయన అభిమానులను, ప్రేక్షకులను కూడా భావోద్వేగాలకు గురయ్యారు. సమంత టాక్ షో ‘సామ్ జామ్’లో పాల్గొన్న రానా తన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. అదే క్రమంలో తన ఆరోగ్యంపై కొన్నాళ్లుగా వస్తున్న వార్తలపై కూడా స్పందించారు. తనకు పుట్టినప్పటి నుంచి బీపీ ఉందన్నారు. దీనివల్ల గుండె సమస్య తలెత్తుతుందని, కిడ్నీలు పాడవుతాయని వైద్యులు తెలిపారని వివరించారు. స్ట్రోక్ హెమరేజ్ (మెదడులో నరాలు చిట్లిపోవడం)కు 70 శాతం, మరణానికి 30 శాతం అవకాశం ఉందనీ చెప్పారంటూ కంటతడి పెట్టారు. దీంతో భావోద్వేగానికి గురైన సమంత కళ్లు కూడా చెమర్చాయి. కార్యక్రమానికి ‘మహానటి’ ఫేమ్ దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా హాజరయ్యారు.
