మిల్క్ బ్యూటీ తమన్నా
తన జాతి కోసం ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధపడే యోధురాలిగా బాహుబలిలో విభిన్న పాత్ర పోషించిన మిల్క్ బ్యూటీ తమన్నా… కరోనాతో తాను చనిపోతానేమోనని అనుక్షణం భయపడిందట. ఆమెకు గత అక్టోబరులో కొవిడ్ పాజిటివ్ రాగా, చికిత్స పొంది కోలుకున్న సంగతి తెలిసిందే. తమ్మూ ఇటీవల నటించిన 11th Hour తెలుగు వెబ్ సిరీస్ ప్రమోషన్స్ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడింది. కొవిడ్ సోకినప్పుడు చికిత్స పొందినన్ని రోజులూ తన జీవితం ఇక్కడితో ముగిసిపోతుందని రోజూ భయపడేదాన్ననని పీడకల లాంటి ఆ రోజులను గుర్తుచేసుకుంది. ఇతరులు కొందరి ప్రాణాలను బలిగొన్న వైరస్ తాలూకు లక్షణాలు తనకు బలంగానే సోకాయని, కానీ అదృష్టవశాత్తూ వైద్యులు తనను కాపాడారని తెలిపింది. ఆ సమయంలో తనకు జీవితం విలువ మరింతగా అర్థమైందని తమన్నా చెప్పుకొచ్చింది.