పదేళ్లుగా ఆ క్షణం కోసమే నిరీక్షించిన గేయరచయిత శ్రీమణి

ప్రేయసిని పెళ్లాడిన వేళ

ప్రముఖ గేయరచయిత శ్రీమణి ప్రేమ కథ తెలుసా? ఆయన కలం నుంచి జాలువారిన ప్రేమామృత సాహిత్యానికి  ఆయనలోని గాఢమైన ప్రేమ కూడా ఓ కారణం కావచ్చు. పదేళ్లుగా ప్రేమించిన ఫరాతో ఆయన పెళ్లి పీటలెక్కిన వేళ తన మనస్సులోని భావాలకు సోషల్ మీడియా వేదికగా అక్షరరూపమిచ్చారు. పెళ్లి పీటలెక్కిన ఫొటోలను  ఆదివారం తన ట్విట్టర్ పేజీలో  షేర్ చేశారు. ‘ఫరాను నా జీవితంలోకి స్వాగతిస్తున్నాను. పదేళ్లుగా ఈ క్షణం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశాం. మా కల నిజమైంది. మా మనసులను అర్థం చేసుకున్న దేవుడికి, తల్లిదండ్రులకు ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు. శ్రీమణికి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ తన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ‘మీ రొమాంటిక్ లిరిక్స్ వెనకున్న రహస్యమేంటో ఇప్పుడు అర్థమయ్యింది. ‘‘ఇష్క్ సిఫాయా’ అని పాడి.. ‘రంగులద్దుకున్న’ అని సీక్రెట్ గా లవ్ చేసి.. ‘ఏమిటో ఇది’ అని మేమందరం అనుకునేలా పెళ్లి చేసుకున్నారన్న మాట’’ అని కామెంట్ చేశారు.  సుకుమార్ తెరకెక్కించిన ‘100‌% లవ్’ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన శ్రీమణికి ‘సెగ’ సినిమాలోని ‘వర్షం ముందుగా’ అనే పాట మంచి గుర్తింపు తెచ్చింది. తాజాగా ‘ఉప్పెన’, ‘రంగ్ దే’ సినిమాలకు సాహిత్యం అందించారు.

Leave a Reply

Your email address will not be published.