రెండో పెళ్లి చేసుకున్న నటుడు ప్రభుదేవా?

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకనటుడు ప్రభుదేవా రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. బిహార్ కు చెందిన ఫిజియోథెరపిస్ట్ ని ముంబయిలోని తన నివాసంలో అత్యంత రహస్యంగా పెళ్లి చేసుకున్నారని, ప్రస్తుతం చెన్నైలో ఈ జంట ఉందని సమాచారం. వెన్నెముక సమస్యతో ఫిజియోథెరపీ చేయించుకునే క్రమంలో చికిత్సలు అందించిన ఫిజియోథెరపిస్ట్ తో ఆయన ప్రేమలో పడి ఈ పెళ్లి చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా ప్రభుదేవా స్పందించలేదు. ఆయనకు 1995లో రామలత్ తో వివాహం కాగా 2011లో ఈ దంపతులు విడిపోయారు. తర్వాత నటి నయనతారతో ప్రేమాయణం నడిచినా ఎక్కువకాలం అది నిలవలేదు.

Leave a Reply

Your email address will not be published.