షూటింగ్ లో మళ్లీ గాయపడిన నటుడు అజిత్

త్వరగా కోలుకోవాలంటూ అభిమానుల ఆకాంక్ష

తమిళ అగ్ర కథానాయకుల్లో ఒకరైన అజిత్ చిత్రీకరణ సమయంలో మళ్లీ గాయపడ్డారు. ఆయన ప్రధానపాత్రలో నటిస్తున్న చిత్రం ‘వలిమై’. హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ లాక్ డౌన్ నిబంధనల సడలింపులతో మళ్లీ హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఇటీవల యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు అజిత్ కు గాయాలయ్యాయి. జోరుగా కురుస్తున్న వర్షంలో బైక్ నడిపే సన్నివేశం చిత్రీకరణలో పాల్గొన్న సమయంలో బైక్ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. లాక్ డౌన్ కు ముందు తమిళనాడులో జరిగిన చిత్రీకరణ సమయంలోనూ అజిత్ గాయపడటం గమనార్హం. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలయ్యింది. #GetWellSoonThala అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. అభిమానుల ఆందోళనలకు అజిత్ మేనేజర్ తెరదించారు. పెద్ద ప్రమాదమేమీ కాదని, చేతికి స్వల్పంగా గాయమయ్యిందని తెలిపారు. దీనివల్ల చిత్రీకరణకు ఎలాంటి అంతరాయం కలగలేదని వివరించారు.

Leave a Reply

Your email address will not be published.