‘సింగం’ నీ నటన అదుర్స్.. మహేష్ బాబు అభినందన

సూర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఆకాశం నీ హద్దురా’ (తమిళ వెర్షన్ ‘సూరరై పోట్రు’). ఎయిర్ డెక్కన్ ఫౌండేషన్ జీఆర్.గోపినాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని మే 1న తెలుగు, తమిళం భాషల్లో విడుదల చేయాలని భావించారు. కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడగా సినీ దిగ్గజ స్ర్టీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 12న డిజిటల్ ప్రీమియర్ గా విడుదలయ్యింది. ఈ నేపథ్యంలో తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల ఈ చిత్రాన్ని చూశారు. దర్శకులుగా సుధా కొంగర అదరగొట్టారని, సూర్య నటన అద్భుతమని ప్రశంసిస్తూ బుధవారం ఓ ట్వీట్ చేశారు. దీనికి ‘సింగం’ కూడా కృతజ్ఞతలు చెబుతూ రీట్వీట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published.