ఆ సినిమా ఎన్నో అనుభవాలను పంచిందంటున్న ‘బుట్టబొమ్మ’

ఈ ఏడాది ఆరంభంలో ‘అల.. వైకుంఠపురం’లో నటించి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న నటి పూజా హెగ్డే ప్రస్తుతం రాధాకృష్ణకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘రాధేశ్యామ్’లో నటిస్తున్నారు. ఇందులో ప్రభాస్ కు జంటగా కనిపించనున్నారు. అలాగే అఖిల్ హీరోగా రానున్న ‘మోస్ట్ఎలిజబుల్ బ్యాచిలర్’ చిత్రంలోనూ పూజా హెగ్డే నటిస్తున్నారు. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ లో సైతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘అరవింద సమేత’ సినిమా గురించి స్పందించారు. రెండేళ్ల కిందట విడుదలైన ఈ చిత్రం గురించి ఆమె మాట్లాడుతూ.. ఆ చిత్రం ఎన్నటికీ తనకు ఓ ప్రత్యేకమైందని తెలిపారు. తారక్ తో కలిసి పనిచేయడం అద్భుతంగా అనిపించిందని, తమ ఇద్దరికీ ఎనర్జీ లెవళ్లు కొంచెం ఎక్కువగా ఉండటంతో ఆన్ స్క్రీన్ లో తమ జంట ప్రేక్షకులను అన్ని విధాలుగా అలరించిందని పేర్కొన్నారు. ఆ చిత్రం ఆఫ్ స్క్రీన్ లో కూడా తనకు ఎన్నో అనుభవాలు పంచిందని, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వల్ల ఆ సనిమాలో అరవింద పాత్రకు డబ్బింగ్ చేప్పుకున్నానని వివరించారు.

Leave a Reply

Your email address will not be published.