క్షీరధేనువు

ఏళ్ల తరబడి పాలిచ్చే ఆవు గురించి ఎప్పుడైనా విన్నారా? వినకపోతే ఇప్పుడు చదివేయండి. అనంతపురం జిల్లా తాడిమర్రికి చెందిన వీరనారప్ప పాడిరైతు. 2011లో చిక్ బళ్లాపూర్ లో రూ.40 వేలకు ఓ ఆవును కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఐదు నెలల కిందటి వరకు రోజుకు 10 లీటర్ల చొప్పున పాలిచ్చిందంట. ప్రస్తుతం ఉదయం పూట 3 లీటర్లు ఇస్తోందని వీరనారప్ప తెలిపారు. హార్మోన్ల ప్రభావం ఎక్కువగా ఉంటే ఇలా జరుగుతుందంటూ పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు. నిజంగా పాడిరైతు పాలిట ఈ ఆవు క్షీరధేనువే కదా.

Leave a Reply

Your email address will not be published.