సాయి పల్లవి కోసం నెటిజన్ల గళం

వంద కోట్ల వీక్షణలు నమోదు చేసిన రౌడీ బేబి పాట

‘మారి-2’లోని రౌడీ బేబి పాట ప్రతి ఒక్కరినీ ఎంతగానో అలరించింది. ఈ పాటలో నటుడు ధనుష్ కు ధీటుగా సాయి పల్లవి చేసిన స్టెప్పులు ప్రేక్షకుల మనసుల్ని కట్టిపడేశాయి. ప్రస్తుతం ఈ పాట వీడియో బిలియన్ (వంద కోట్ల) వీక్షణలతో దక్షిణ భారత్ లోనే సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా సంతోషం వ్యక్తం చేస్తూ ‘ఉండర్ బార్ ఫిలిమ్స్’ బుధవారం ట్విట్టర్ పేజీలో ఓ పోస్టరు విడుదల చేసింది. అందులో ధనుష్ మాత్రమే ఉండటం వివాదాంశమైంది. రౌడీ బేబి పాట విజయవంతంలో నటి సాయి పల్లవి భాగస్వామ్యం కూడా ఉన్నప్పుడు ధనుష్ ఫొటో మాత్రమే విడుదల చేయడం వెనుక కారణమేమిటని ప్రశ్నిస్తున్నారు. సాయి పల్లవిని అణగదొక్కేందుకే ఇలా చేస్తున్నారా? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉండర్ బార్ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published.