‘బిగ్ బాస్’ షో చూపిస్తూ బ్రెయిన్ ఆపరేషన్

సృహలో ఉండగానే మెదడులో కణితి తొలగింపు

రోగి సృహలో ఉండగానే అతడి మెదడుకు శస్ర్తచికిత్స చేసి కణితిని తొలగించిన అరుదైన ఘటన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. శస్ర్తచికిత్స చేసే సమయంలో రోగికి ‘బిగ్ బాస్’ షో, అవతార్ సినిమా చూపించడం గమనార్హం. దీనికి సంబంధించిన వివరాలను ఆస్పత్రి వైద్యబృందం భవనం హనుమా శ్రీనివాసరెడ్డి, శేషాద్రి శేఖర్, త్రినాథ్ విలేకరులకు వివరించారు. పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామానికి చెందిన వరస్రసాద్ (33)కు మెదడులో కణితి ఉన్నట్లు గుర్తించి 2016లో హైదరాబాద్ లో శస్ర్తచికిత్స ద్వారా దానిని తొలగించారు. కొన్ని నెలలుగా ఆయనకు తరచూ మూర్ఛవ్యాధి వస్తుండటంతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించారు. మెదడలో మళ్లీ 3 సెం.మీ మేరకు కణితి పెరిగినట్లు గుర్తించారు. ఈ నెల 10న నావిగేషన్ పరిజ్ఞానంతో కణితి ఉన్న భాగంలో మాత్రమే మెదడు తెరిచి ఆ కణితిని తొలగించారు. శస్ర్తచికిత్స చేసిన భాగం మాటలు, సంభాషణలకు కీలకమైన ప్రాంతం కావడంతో రోగి సృహలో ఉండగ మెదడులో సంభవించే పరిణామాలు పరిశీలిస్తూ ఈ శస్ర్తచికిత్స చేసినట్లు వైద్యలు తెలిపారు. దీని కోసం రోగికి ల్యాప్ టాప్ ద్వారా ‘బిగ్ బాస్’ రియాల్టీ షో, అవతార్ సినిమాను గంటన్నర పాటు చూపించారు. రోగి పూర్తిగా కోలుకున్న తర్వాత శుక్రవారం డిశ్చార్జి చేశామని వివరించారు.

Leave a Reply

Your email address will not be published.