జాతిపిత మహాత్మాగాంధీకి వరసకు ముని మనుమడయ్యే సతీష్ ధుపేలియా (66) కరోనాతో కన్నుమూశారు. దక్షిణాఫ్రికాలోని జొహెన్నెస్ బర్గ్ లో నివసించే ఆయన కొంత కాలంగా న్యూమోనియాతో బాధపడ్డారు. నెల రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ సమయంలో కరోనా బారినపడగా ఆదివారం రాత్రి హఠాత్తుగా గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచినట్లు ఆయన సోదరి ఉమా ధుపేలియా మెస్ర్తీ వెల్లడించారు. మూడు రోజుల కిందట ఆయనకు 66వ జన్మదిన వేడుకలు కావడం గమనార్హం. సతీష్ దక్షిణాఫ్రికాలో గాంధీ డెవలప్ మెంట్ ట్రస్ట్ కార్యకలాపాలు నిర్వహించేవారు. ఆయన తన జీవితకాలంలో ఎక్కువ భాగం మీడియా రంగంలో వీడియో, ఫొటోగ్రాఫర్ గా పనిచేశారు.
