3 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టివచ్చిన ధీరవనిత

గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ అంటే ఆమెకు ఎంతో మక్కువ. దాని కోసం ఏకంగా ప్రపంచాన్ని చుట్టేసి వచ్చింది. అదినూ అతితక్కువ సమయంలో. గిన్నిస్ రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఆమె యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ కు చెందిన డాక్టర్ ఖావ్లా అల్ రొమైతీ (21). గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించాలన్నది ఆమె కల. దానిని సాకారం చేసుకోవడానికి తక్కువ సమయంలో ప్రపంచాన్ని చుట్టి రావాలని నిర్ణయించింది. దీని కోసం పక్కాగా ప్లాన్ సిద్ధం చేసుకుని ఫిబ్రవరి 9వ తేది ప్రపంచ యాత్ర మొదలుపెట్టింది. 3 రోజుల 14 గంటల 46 నిమిషాల్లో 208 దేశాలను చుట్టేసింది. అతితక్కువ సమయంలో ప్రపంచాన్ని చుట్టినందుకు గాను ఆమె పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కింది. ఆ సంస్థ ఇచ్చిన సర్టిఫికెట్ ను గురువారం ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఉంచారు. ‘నాకు గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్స్ అంటే ఎంతో ఆసక్తి. అందుకే ప్రపంచాన్ని చుట్టేశా’ అంటూ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.