ఏదైనా విషయం అంతు చిక్కకుంటే దానిని చిదంబర రహస్యమని చెప్పడం తెలిసిందే. తమిళనాడులో కడలూర్ జిల్లాలోని చిదంబరం అనే ఊరిలో ఉన్న నటరాజ ఆలయం నేపథ్యంతో ఈ నానుడి ముడిపడి ఉంది. ఇది పంచభూత క్షేత్రాల్లో ఒకటి కావడం గమనార్హం. ఇప్పడీ ప్రస్తావన ఎందుకంటే, ఈ ఆలయానికి సంబంధించి ఆశ్చర్యకరమైన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 34 సెకన్ష నిడివి ఉన్న ఈ వీడియోలో చీకటి సమయంలో ఆలయంపై భాగాన ఉన్న నటరాజ శిల్పంపై మాత్రమే ధారగా వర్షపు జల్లులు పడేలా కనిపిస్తోంది. ఈ శిల్పానికి రెండు వైపుల ఉన్న మరో రెండు శిల్పాలు, కొంత దూరంలో ఉన్న మరికొన్ని శిల్పాలపై జల్లులు పడనట్లూ వీడియోలో కనిపిస్తోంది. దీంతో ఇది మరొక చిదంబర రహస్యం అనే ప్రచారం గుప్పుమంది. ఈ వీడియోపై విశ్లేషణలు కూడా జరిగాయి. నటరాజ శిల్పం పైభాగం నుంచి లేదా కింద భాగం నుంచి కాని విద్యత్తు కాంతి వెదజల్లడం వల్లే ఆ శిల్పంపై మాత్రమే వర్షపు జల్లులు పడేలా కనిపిస్తోందని కొందరు వాదిస్తున్నారు. ఇది చీకటి సమయంలో వీధి దీపం వెలుగులో మాత్రమే వర్షం కురిసేలా కనిపించే దృశ్యం వంటిదని వివరిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
వీడియో లింక్ https://www.youtube.com/watch?v=UaJ0s7NIp-Q