నీ అభిమానం బంగారం కానూ…

ఎంతమాత్రం ఆయనపై అభిమానం ఉంటే నువ్వు ఇంతలా చేయాలా? అంటూ పలువురు ముక్కున వేలేసుకునేలా  ఒక వ్యక్తి తనకు ఇష్టమైన ఎమ్మెల్యే కోసం వింత మొక్కును తీర్చుకున్నాడు. ఇంతకీ ఎవరతను? ఏం చేశాడో తెలుసుకుందాం. తెలంగాణలోని జనగామ జిల్లా చిల్పూర్ గుట్టకు చెందిన మూల నాగరాజు తెరాస కార్యకర్త. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు వీరాభిమాని. బుధవారం ఎమ్మెల్యే పెళ్లి రోజు కావడంతో చిల్లూర్ గుట్ట శ్రీ బుగులు వెంకటేశ్వరస్వామి సన్నిధిలో 101 కొబ్బరికాయలు కొట్టాడు. దీని కోసం గుడికి మోకాళ్లపై ఎక్కి వచ్చాడు.  అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే పేరుపై ప్రత్యేక పూజలు చేయించాడు. భవిష్యత్తులో ఎమ్మల్యే తాటికొండ రాజయ్యను మంత్రిగా చూడాలని మొక్కుకున్నారు. ఈ నాగరాజు చిల్పూర్ గుట్ట దేవస్థానానికి మూడు సార్లు ఛైర్మన్ గా ఎన్నిక కావడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published.