4 రోజులు భర్త అంత్యక్రియలు అడ్డుకున్న మహిళ

లెక్క తేలందే చితికి నిప్పుపెట్టడానికి వీల్లేదంటూ ఓ వివాహిత పట్టుబట్టి 4 రోజులు పాటు భర్త అంత్యక్రియలు అడ్డుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. సిద్దార్థ్ నగర్ జిల్లా రెహరా బజార్ ప్రాంతానికి చెందిన గజేంద్ర ప్రసాద్ ఇటీవల మరణించారు. ఆయనకు అంత్యక్రియలు చేయడానికి ప్రయత్నించగా భార్య అంజూ జైశ్వాల్ అడ్డుపడ్డారు. మతిస్థిమితంలేని భర్త నుంచి 2016లో రాజూ ఛపడియా అనే వ్యక్తి ఇంటిని రాయించుకున్నాడని, దానిని తన పేరుకు రాసే వరకు భర్తకు అంత్యక్రియలు నిర్వహించడానికి వీల్లేదని భీష్మించారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు 4 రోజులు పాటు పట్టు విడవలేదు. ఈ విషయం పోలీసుల చెవినపడటంతో అక్కడికి చేరుకుని అంజూ జైశ్వాల్ కు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. పోలీసులు మాట కూడా ఆమె వినలేదు. దీంతో చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటోందని హెచ్చరించడంతో కొంచెం శాంతించారు. దీంతో మృతుడి సోదరుడు దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఈ ఆస్తి వివాదం కోర్టులో ఉందని మృతుని బంధువులు మీడియాకు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.